శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ పై కేసు నమోదు

0
167

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుండి అవసరమైన పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ప్లాట్స్ రిజిస్టర్ చేస్తామని హామీ ఇవ్వడంతో పెట్టుబడి పెట్టినట్టు విష్ణు వర్ధన్ అండ్ కో చెప్పారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ, కంపెనీ నుండి సరైన సమాచారం లేకపోవడం వల్ల పెట్టుబడి పెట్టిన వారందరికీ అనుమానం వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో విచారణ నిర్వహించగా.. వారి పెట్టుబడికి సంబంధించిన అన్ని మార్ట్‌గేజ్ ప్లాట్‌లు వారికి తెలియకుండా SRV & TNR ఇన్‌ఫ్రా-రాజారామ్ & VASGI వెంకటేష్ అనే ఫైనాన్షియర్‌ల పేర్ల మీదకు వెళ్లిపోయాయని తెలిసింది. దీంతో వారు షాక్ అయ్యారు.

సినీ నటుడు మహేష్ బాబు లాంటి వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడంతో ఎటువంటి మోసం జరగదు అని భావించి కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న వీరు.. ప్రాజెక్ట్ సైట్‌కి వెళ్లి చూస్తే, అసలు అభివృద్ధి జరగలేదని, అవసరమైన అనుమతులు ఆశించిన విధంగా పొందలేదని తేలింది. ఈ అంశం మీద మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 406, 420 కింద నిందితులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, మోసం చేశారని కంప్లైట్ చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here