ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

219

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్టణం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, పశ్చిమ గోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కోటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. కాగా, ఏపీలో అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానిక సంస్థల నియోజవకర్గ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఈ నెల 16న ఫలితాలను వెల్లడిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here