ఆస్కార్ వేదికపై ఎగిరిన తెలుగు జెండా.. అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్..

286

సినీ ప్రపంచంలో తెలుగు జెండా సగర్వంగా రెపరెపలాడింది. తెలుగు సినిమా కీర్తి దిగంతాలకు ఎదిగింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట బెస్ట్ సాంగ్ అవార్డును సాధించింది. ఈ పాటను సృష్టించిన సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లింది. లైవ్ లో చూస్తున్న కోట్లాది మంది అభిమానులు ఆనందంతో పులకించిపోయారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.  

M.M. Keeravani and Chandrabose Win Best Original Song at 2023 Oscars –  Billboard

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here