‘వీరసింహా రెడ్డి’ నుంచి హుషారెత్తించే మరో మాస్ బీట్!

241

బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ‘వీరసింహరెడ్డి’ సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమాలోని కీలకమైన పాత్రతో హనీ రోజ్ పరిచయమవుతోంది.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రతి పాటా మాస్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘మాస్ మొగుడొచ్చాడే’ అనే మరో పాటను వదిలారు. ‘యాంది రెడ్డి .. యాంది రెడ్డి యాడజూడు నీదే జోరు, తొడలు గొట్టి .. హడలగొట్టి మొగతాంది నీదే పేరు’ అంటూ ఈ పాట మొదలవుతోంది.

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సాహిత్యం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మనో – రమ్య బెహ్రా తమ స్వరంతో ఈ పాటను మరింత హుషారుగా పరిగెత్తించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో కలర్ ఫుల్ సెట్స్ లో చిత్రీకరించిన ఈ పాటి, మాస్ నుంచి మంచి మార్కులను కొట్టేసేలానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here