‘మెగా’ కథపైనే పూరి కసరత్తు!

233

పూరి జగన్నాథ్ పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడుతూనే ఉన్నాడు. ఆయన పనైపోయిందని అనుకున్నవారికి హిట్ తో సమాధానం చెబుతూనే వస్తున్నాడు. అలాంటి పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ సినిమా బాగానే ఇబ్బంది పెట్టింది. అయినా ఆ షాక్ నుంచి కూడా ఆయన త్వరగానే కోలుకున్నాడు. మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 

గతంలో చిరంజీవితో ఆయన ‘ఆటోజాని’ చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. ఆ మధ్య చిరంజీవి ఆ సినిమా గురించి ప్రస్తావిస్తే, అంతకంటే మంచి కథతో వస్తానని పూరి చెప్పాడు. అలాంటి కథ కోసం తాను వెయిట్ చేస్తూ ఉంటానని చిరంజీవి అన్నారు. ఆ తరువాతనే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో పూరి జర్నలిస్ట్ పాత్రను చేశాడు. 

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ఆ తరువాత ఆయన చేతిలో ఉన్నది ‘భోళా శంకర్’ మాత్రమే. మరో ప్రాజెక్టును మెగాస్టార్ ఒప్పుకోలేదు. అందుకు కారణం పూరితో చేయాలనీ ఆయన ఫిక్స్ కావడమే అనే టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథపైనే పూరి కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here