ప్రభాసూ నాకే ట్విస్ట్ ఇస్తావా?: ‘అన్ స్టాపబుల్ 2’ ప్రోమోలో బాలకృష్ణ

275

ఆహా’ ఫ్లాట్ ఫామ్ పై ‘అన్ స్టాపబుల్ 2’ టాక్ షోకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో క్రితం వారం స్ట్రీమింగ్ అయిన ప్రభాస్ – గోపీచంద్ ఎపిసోడ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ మేనరిజం దగ్గర నుంచి ఆయన పెళ్లి వార్తల వరకూ ఈ ఎపిసోడ్ లో చోటుచేసుకుని, అభిమానులను అలరించాయి. 

ఇక సెకండ్ పార్టు ఈ నెల 6వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఆ ఎపిసోడ్ తాలూకు హైలైట్స్ తో కొంతసేపటి క్రితం ‘ప్రోమో’ను వదిలారు. గోపీచంద్ నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఏదో విషయాన్ని బయటికి లాగడానికి బాలకృష్ణ ప్రయత్నించారు. “ఫుల్లుగా చెప్పు .. సగం .. సగం చెప్పావనుకో” అంటూ గోపీచంద్ కి ప్రభాస్ చూపుడు వ్రేలు చూపించాడు.

“ఎక్కడ నిజం బయటపడి పోతుందోనని గోపీచంద్ ను ప్రభాస్ దబాయించేస్తున్నాడు .. నా ముందు వార్నింగులు ఇవ్వొద్దమ్మా” అంటూ గోపీచంద్ ను బాలయ్య సపోర్టు చేశారు. ” మరి ఏ అమ్మాయి అని ఎందుకు అడిగారు?” అంటూ ప్రభాస్ అడిగాడు. “అబ్బా నాకే ట్విస్టా?” అంటూ బాలకృష్ణ సందడి చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here