ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి నుంచి మాళవిక నాయర్ బ్యూటిఫుల్ పోస్టర్!

218

మాళవిక నాయర్ పేరు చెప్పగానే ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘విజేత’ .. ‘టాక్సీవాలా’ .. ‘థ్యాంక్యూ’ సినిమాలు చేసినా, ఆశించిన స్థాయిలో అవి ఆమె కెరియర్ కి హెల్ప్ కాలేకపోయాయి.

అయితే మాళవిక చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమెకి పడవలసిన మార్కులు పడిపోతూనే వచ్చాయి. అందువలన అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళుతూనే ఉన్నాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’ రెడీ అవుతోంది. 
 
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె నాగశౌర్య జోడీగా కనిపించనుంది. ఈ రోజున మాళవిక పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్ లో పొద్దు తిరుగుడు పువ్వులా ఈ పోస్టర్ లో ఆమె ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here