అంతర్జాతీయ క్రికెట్​కు బ్రావో గుడ్ బై

852

వెస్టిండీస్ స్టార్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్​ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు.

గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలుకు సమయం వచ్చేసిందని అతను పేర్కొన్నాడు. 18 ఏళ్లుగా వెస్టిండీస్​ జట్టులో ఆడుతున్నానని… ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పాడు. కానీ, కరీబియన్​ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నట్లు వివరించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్​ పేరు నిలబెట్టుకున్నామని బ్రావో పేర్కొన్నాడు. రెండు ట్రోఫీలు డారెన్ సామి సారథ్యంలో పొందినట్లు గుర్తుచేసుకున్నాడు. గురువారం లంకతో మ్యాచ్​ అనంతరం ఫేస్​బుక్​ లైవ్​లో ఈ కామెంట్స్ చేశాడు బ్రావో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here