బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది.
గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.