వివాదాలకు చిరునామాగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరో మారు వివాదాలను సృష్టించే పనిలో పడ్డాడు. వర్మ తీసే ఏ సినిమాలో అయినా ఏదో ఒక వివాదం ఉంటుంది. రక్త చరిత్ర మొదలు, వంగవీటి, లక్శ్జ్మీస్ ఎన్టీఆర్ దాకా ప్రతీ సినిమాలో వివాదమే. అయితే రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలని ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీసే వర్మ ఈ సారి నిజ జీవితంలో భవిష్యత్తులో జరగబొయే ఊహించిన నిజం తీస్తున్నాడట.

అయితే ఆ సినిమాని “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సంచలనంగా మారింది. కులాల మీద పేరుతో సినిమా తీసి వర్మ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని కొందరు రాజకీయ పార్టీ నాయకులు వర్మపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలకి వర్మ తనదైన శైలిలో స్పందించాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ పై పాటల రచయిత జొన్నవిత్తుల తీవ్ర కామెంట్లు చేశారు . ఇలాంటి టైటిల్స్ పెట్టి వర్మ పైశాచికానందాన్ని పొందుతున్నాడని అన్నారు. అంతే కాదు ఒకానొక డిబేట్ లో వర్మ జొన్నవిత్తుల గారిని జొన్న విత్తుల చౌదరి గారు అని పిలిసి, వోడ్కా తాగి మళ్ళి వస్తానని హేళనగా మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. వర్మ ఇంకా జొన్నవిత్తుల గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు.

దీంతో జొన్న విత్తుల గారు వర్మను పప్పు వర్మ అనే కొత్త పేరును ఇవ్వడమే కాకుండా, వర్మ పైశాచికత్వం పై మూవీ తీస్తాను అంటూ సవాల్ విసిరారు. ఎప్పుడూ వేరొకరి వ్యక్తిగత జీవితాలను తెరపై చూపించే వర్మ, తన బయోపిక్ గురించి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments