రాజమండ్రి జైలులో లోక నాయకుడు …

579

కమల్ హాసన్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం ఇలా సెంట్రల్ జైలుకు చేరుకున్నాడు కమల్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు కమల్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో నడుస్తోంది. కమల్ పై కొన్ని సీన్స్ తీస్తున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. సినిమాకు సంబంధించి ఇది రెండో షెడ్యూల్.

సూపర్ హిట్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఇండియన్-2. ఇందులో ముసలి గెటప్ లో ఉన్న సేనాపతి పాత్రలో కమల్ కనిపించబోతున్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తీస్తున్న సన్నివేశాలు సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలో రకుల్, కాజల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రకుల్ ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. నవంబర్ నుంచి కాజల్ జాయిన్ అవుతుంది. సినిమాలో ఓ కీలక పాత్రలో సిద్దార్థ్ నటిస్తున్నాడు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఇండియన్-2 సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆరంభంలోనే దిల్ రాజు తప్పుకున్నాడు. ఆ తర్వాత లైకా సంస్థ పట్టాలపైకి వచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనేది ప్లాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here