తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురు యువకులను హైదరా బాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరా రీలో ఉన్నాడు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన గచ్చి బౌలిలో రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్‌ చేయాలం టూ ముగ్గురు యువకులు రెవెన్యూశాఖకు దర ఖాస్తు పంపారు.
అయితే అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతకం ఉండడం చూసి రెవెన్యూ అధికారులు షాక్‌అయ్యారు. పరిశీలించి చూడగా ఆ దరఖాస్తులో ఉన్న సంతకం ఫోర్జరీ అని తేలింది. వెంటనే మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు
దర్యాప్తు చేయగా యాకుత్‌పురా ఏరియాకు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ పార్టీ నేత నుంచి లెటర్‌ హెడ్‌ కొనుగోలు చేసినట్టు తేలింది. ఎంతో విలువైన ముఖ్యమంత్రి లెటర్‌ హెడ్‌ను సదరు టీఆర్‌ఎస్‌ పార్టీ నేత యువకులకు రూ.45 వేలకు అమ్మేశాడు. ఆ లెటర్‌ హెడ్‌ మీద 2 ఎకరాల భూమి రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దరఖాస్తు నింపి, ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి రాజేంద్రనగర్‌ ఆర్టీవోకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో ఉన్న వివరాల ప్రకారం దరఖాస్తుదారులు రాయదుర్గం ఏరియాలో నివాసం ఉంటున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఫోర్జరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments