విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్. ఆయన నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ”మా హీరో సుమంత్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చెయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ బాగుందంటూ ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్ చేస్తుంటే ఆనందంగా ఉంది.

సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది..” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here