తాను జనసేనలో ఉన్నానని, తన భార్య మాత్రం టీడీపీ తరఫున గెలిచి జడ్పీటీసీ పదవిలో ఉందని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నేత బర్రె జయరాజు, పవన్ కోరితే తన భార్యను టీడీపీ నుంచి రాజీనామా చేయించేందుకు సిద్ధమని అన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు సైతం చెప్పానని ఆయన మీడియాతో అన్నారు.తదుపరి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసే అవకాశం లభిస్తే తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమని చెప్పిన ఆయన, నరసాపురంలో ఎవరికి సీటు ఇచ్చినా వారి గెలుపునకు తనవంతు సాయం చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తారని ఆశించి తాను ఈ మాటలు అనడం లేదని, ఆయనపై నమ్మకం, జనసేన సిద్ధాంతాలు నచ్చి చేరానని అన్నారు. ఆయన ఆదేశిస్తే, తన భార్య వెంకట రమణ జడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేస్తారని చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments