ఒక సామాన్య సినిమా క్రిటిక్ గా ఉన్న కత్తి మహేష్ బిగ్ బాస్ షో తరువాత ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు . ఆయన పవన్ కల్యాణ్ విషయంలో చేసిన ఆరోపణలు అనేక వివాదాలకు దారితీసి దాని తరువాత పవన్ ఫాన్స్ సహకారంతో సద్దుమనిగిన విషయం తెలిసిందే . అయితే ఆయన మళ్ళీ వివాదాలకు కేంద్రబిందువయ్యారు . సాక్షాత్తు శ్రీరాముడు పై మోసగాడు అని ఆరోపణలు చేసి దానిని సమర్ధించే పనిలో పడ్డారు కత్తి మహేష్ . అయితే ఈ విషయంలో కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పురోహితులు ఏలూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . జూన్‌ 29వ తేదీన ఒక టీవీ చానల్‌లో ‘ఆధారం ఉందా’ అనే చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్‌కు ఫోన్‌ చేయగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని నిందిస్తూ, సీతాదేవిని కించపరుస్తూ మాట్లాడారని పురోహితులు ఆరోపించారు. సీత రాముడు దగ్గర ఉండడం కన్నా రావణాసురుడి వద్ద ఉంటేనే తనకు న్యాయం జరిగి ఉండేదని అన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments