భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ , సునీల్ ప్రధాన పాత్రలుగా సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసినదే . గతంలో అల్లరి నరేష్ , భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో సుదిగాడు చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది. దాని తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం సుదిగాడు కు సీక్వెల్ అని , సుదిగాడు 2 అనేది ఈ చిత్రం పేరని వార్తలు వచ్చాయి .

అయితే వీటన్నిటికీ తెరదించుతూ అల్లరి నరేష్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా రివీల్ చేశారు . ఈ చిత్రానికి సిలీ ఫెలోస్ అని టైటిల్ పెట్టగా , ఫస్ట్ లుక్ లో సునీల్ , నరేష్ జరిగే సరదా సన్నివేశం లోని ఫోటోను ఉంచారు . చాలా రోజులుగా అటు నరేష్ కు ఇటు సునీల్ కు సరైన హిట్ దక్కలేదు . మరి ఈ చిత్రం తో ఇద్దరికి సక్సెస్ దక్కుతుందేమో వేచి చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments