ఆంధ్రరాష్ట్ర విభజన అయ్యి నేటికి నాలుగు ఏళ్ళు పూర్తి అయ్యింది . ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు . ఆయన స్పందిస్తూ “విభజన జరిగి నాలుగేళ్ళు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు . కేంద్ర , రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు . ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేకహోదాను తిరస్కరించారు . రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు . పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు” అని పేర్కొన్నారు .
చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెబుతారు …
Date: