ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం మహానాడు సందర్భంగా ప్రసంగించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను విమర్శించడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ ను వాడుకుంటోందని , బీజేపీ మాటలను నమ్మి పవన్ అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని అన్నారు . పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తామంటున్నారని , ఆయన పోటీ చేస్తే ఆంధ్రరాష్ట్రంలో ఓటు వేసేవారు ఒక్కశాతం కూడా లేరని చంద్రబాబు అన్నారు .

ఇంకా మాట్లాడుతూ బీజేపీ ధోరణి వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని అన్నారు . అమరావతిలో నిర్మాణాలకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను కేంద్రానికి పంపినా తమకేమి అందలేదని అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు . జాతీయస్థాయి నేతలు మాట్లాడాల్సిన తీరు ఇది కాదని , అనవసరంగా ఓ రాష్ట్రంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు తెలిసోచ్చిందని , తదుపరి ఎన్నికలలో బీజేపీ కి ప్రజలు అదేవిధంగా బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు . కుట్ర రాజకీయాలపై తాను ధర్మపోరాటం చేస్తున్నాని , ఈ పోరాటంలో తాను విజయం సాదిస్తానన్న నమ్మకం తనకుందని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments