హాస్యానికి చిరునామా “బ్రహ్మానందం”…

0
254

శ్రీ ప్రఖ్య ఆర్ట్స్‌ (సంగీత సుధా వేదిక), అభినయ కూచిపూడి కళాక్షేత్రం సంస్థ 18వ వార్షికోత్సవాలను బుధవారం రవీంద్ర భారతి ప్రధాన వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రఖ్య ఆర్ట్స్‌ లలిత కళా పురస్కారాన్ని ప్రఖ్యాత హాస్యనటుడు డాక్టర్‌ బ్రహ్మానందంకు అందజేశారు. ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా నటి జమున హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బ్రహ్మానందాన్ని  పురస్కారంతో సత్కరించి ప్రసంగిం చారు. బ్రహ్మానందం హాస్యం.. బ్రహ్మాండంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో సినీ పరిశోధకులు, సంగమం సంస్థ వ్యవస్థాపకులు సంజయ్‌ కిషోర్, ప్రఖ్య ఆర్ట్స్‌ కార్యదర్శి జయశ్రీ పాల్గొన్నారు. సభా ప్రారంభంలో జయశ్రీ శిష్య బృందం నిర్వహించిన స్వర మాధురి అలరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here