చంద్రబాబు ఇంట్లో సోదాలు చేసుకోవచ్చు…

657

తిరుమల పోటు నేలమాళిగలోని విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్, అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని,సీబీఐ ను పంపి తనిఖీలు నిర్వహించాలని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘విజయసాయిరెడ్డి సవాల్ కు మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ మిత్రపక్షమైన బీజేపీని ఒప్పించి చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహించుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒకవేళ చంద్రబాబు ఇంట్లో నగలు దొరక్కపోతే 13 గంటల్లోగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలి. వెంకన్న నగలపై ఆరోపణలు చేస్తున్న విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం. క్రిమినల్ కేసులు పెడతాం. బీజేపీ డైరెక్షన్ లో వైసీపీ యాక్షన్ చేస్తోంది. చంద్రబాబును విమర్శించే స్థాయి విజయసాయిరెడ్డికి లేదు’ అని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here