కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఒక వేదికపై కొలువుదీరారు. ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయగీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఆ తరువాత వేదిక పైన ఉన్న పెద్దలంతా కరచాలనం చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఇంతలో ఇక ఆశక్తికర సంఘటన చోటు చేసుకుంది . చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాని తరువాత చంద్రబాబు రాహుల్ భుజంపై తట్టి రాహుల్ ను అభినందించారు . కొన్ని క్షణాలు పాటు ఇద్దరు ముచ్చటించుకున్నారు. ఎప్పుడూ వైరపక్షం గా ఉండే వీరిద్దరూ ఇలా ఆప్యాయంగా పలకరించుకోవడం చూస్తే ఆంధ్రా రాజకీయాయలో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments