కర్ణాటక సంఘటనతో ప్రజాస్వామ్యశక్తులన్నీ ఏకమయ్యాయి…

0
289

కర్ణాటక సంఘటనపై కమలహాసన్ స్పందించారు. ప్రాజాస్వామ్యశక్తులు ఏకం కావడానికి కర్ణాటక సంఘటన నాంది పలికింది అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని కమల్ కలిసారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,మక్కల్ నీతి మయ్యం ఇనాగ్యురాల్ ఫంక్షన్ కోయంబత్తూరులో నిర్వహించనున్నామని, ఈ వేడుకకు ఆయన్ని ఆహ్వానించే నిమిత్తం కలిశానని కమల్ చెప్పారు. ఈ వేడుక ఏ తేదీన నిర్వహించే విషయం త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కేరళలో ఎల్ డీఎఫ్ ప్రభుత్వం పాలన బాగుందని ప్రశంసించారు.  ఈ సందర్భంగా కావేరీ జలాలు వ్యవహారం గురించి ప్రస్తావించారు.కాగా, ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం కమల్ నిన్న కేరళ వెళ్లారు.ఈ సందర్భంగా కొచ్చిలో పినరయి విజయన్ ని కమల్ కలవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here