మాకు ఆ హక్క ఉంది…

0
290

ఓట్ల లెక్కింపు తరువాత కన్నడ రాజకీయం అనేక మలుపులు తిరిగింది. ముందుగా యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం,తరువాత బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కర్ణాటక శాసనసభలో బీజేపీ కు సంఖ్యాబలం లేకపోవడంతో యడ్యూరప్ప రాజీనామా చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. కర్ణాటక బీజేపీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసినదే.

ఇటువంటి నేపధ్యంలో సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాం తప్ప తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలనే జేదేఎస్ ఎన్నికలలో ప్రచారం చేసిందని ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ ఈ ఎన్నికలలో బీజేపీ సీట్ల సంఖ్య 40 నుండి 104 కు పెరిగిందన్నారు. కాంగ్రెస్ సీఎం,మంత్రులను ప్రజలు తిరస్కరించారన్నారు. కన్నడ ప్రజలు కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు.  సిద్ధరామయ్య ఓడిపోయినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోందా ?  అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here