ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కూడా రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. ఎన్టీఆర్ ఫాన్స్ తమ హీరోను అలా సిక్స్ ప్యాక్ తో చూసుకొని సంబరపడిపోతున్నారు. అలాగే అరవింద సమేత టైటిల్ కూడా కొత్తదనంగా ఉంది. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫాన్స్ కు మరో గిఫ్ట్ చిత్రబృండం నుండి అందింది . అదేంటంటే ఈ సినిమా మోషన్ పోస్టర్,ఇందులో యంగ్ టైగర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. హారిక అండ్ హసినే క్రియేషన్స్ బ్యానర పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.