క్లైమాక్స్ లో పంతం…

1182

గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమా రూపొందుతోంది. గోపీచంద్ కి బాగా అచ్చొచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ద్వారా చక్రవర్తి అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మిగిలిన సన్నివేశాలను .. పాటలను యూకేలో ప్లాన్ చేశారు. ఇందుకోసం త్వరలో ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాను జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here