మంగళవారం, సెప్టెంబర్ 21, 2021
Home Blog

సంగీతానికి సాహిత్యానికి వారధి

0

పల్లవి:
Male:
మనసే హాయిగా ఏరై పారేనే సెలయేరై పారేనే..
విరిసే పూవులే దారై పోయేనే..
రహదారై పోయేనే
Female:
గుండెల్లో పొంగేటి ఆశలే
బంధాలు వేశాయిలే..
నీలాల ఆ నింగి తారలే
గారంగా చూశాయిలే..
Male:
అరె కళ్ళలోన దాచుకున్న
కలల అలలు ఇవిలే..
౹౹మనసే హాయిగా౹౹
చరణం:
Male:
ఎదలో రాగాలు సుధలే చిందేనే..
ఇలలో అందంగా కథలే రాసేనే..
Female:
అడుగు అడుగు తోడుగా
సాగేను కాలాలుగా..
చిలిపి చిలిపి వేడుక
చిత్రాలు చేసేనుగా..
Male:
చిరు కిరణమిలా చేరెనెలా
ఆకాశమార్గాన నేలా..
Female:
అది చూసింది ఓ చారుశీలా..
౹౹మనసే హాయిగా౹౹
చరణం:
Female:
మదిలో భావాలు మెదిలే వేదాలై..
హృదిలో నాదంగా కదిలే యోగాలై..
Male
ఎగసె ఎగసె ఊహలే బంగారు ప్రాయాలుగా..
మెరిసె మెరిసె మేఘమే
సింధూర వర్ణాలుగా..
Female:
ఒక పాట ఇలా పలికెనులే
ఆనంద లోకాన నేడు
Male:
అది హిందోళ రాగాన చూడు
౹౹మనసే హాయిగా౹౹●

  • – రచన : మౌనశ్రీ మల్లిక్

సంగీతానికి సాహిత్యానికి వారధి

భీమవరం టాకీస్ బ్యానర్ మీద తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో నరసింహ నంది దర్శకత్వంలో ఈనెల పదోతేదీన విడుదలవుతున్న జాతీయరహదారి చిత్రంలోని అద్భుతమైన గీతమిది. నరసింహ నంది పేరు చెప్పగానే 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి విభిన్నమైన కథాంశాలతో హృదయానికి హత్తుకునే చిత్రాలు మనముందు కదలాడుతాయి. ఇవన్నీ కూడా అవార్డుల పంట పండించిన చిత్రాలే కావడం విశేషం. ఆ కోవలోనే వస్తున్న మరో చిత్రరాజమిది.
ఈ సినిమా పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ అనేక చలన చిత్రాలకు, టీవీ సీరియళ్లకు వందలాది పాటలు రాసి సమకాలీన రచయితలలో తనకంటూ ప్రత్యేకమైన ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన గీతమిది.
సంగీత, సాహిత్య రహస్యాలను తెలిసిన రచయిత తప్ప మరొకరు రాయలేని పాట ఇది. జాను తెనుగులో సాగిన యుగళగీతం. లలిత లలితమైన అలతి అలతి తెనుగుపదాలతో సరళంగా సాగిన సుందర గీతమిది. ఎక్కడా ద్విత్వాక్షరాలు కానీ, క్లిష్టమైన నిఘంటువు అవసరం అయిన పదాలు కానీ ఉపయోగించకపోవడం ఆ పాత్రల మనస్తత్త్వాన్ని పట్టిచూపుతోంది. పాటలోని పదాల పొందిక, ఆ భార్యాభర్తల అన్యోన్యతను చాటిచెబుతున్నాయి. సాహిత్య పరిభాషలో దీనిని రచనాకళగా పరిగణించాలి. ఇలాంటి ప్రయోగాలు పాటకు ఉన్నతస్థాయిని కలిగిస్తాయి. అలాగే రచయిత స్థాయి ఎంతటిదో తెలుపుతాయి.


పల్లవిలో ‘విరిసే పూవులే దారై పోయెనే.. రహదారై పోయెనే.. అని రాయడంలో ఒక అలంకారం ఉంది. చిత్రం పేరు జాతీయ రహదారి లో రహదారి అనే పదాన్ని ఇమడ్చడం ముద్రాలంకారమని అంటారు. ఇది సాహిత్యపరంగా ఒక రచనా విన్యాసమని చెప్పవచ్చు.
పాట అనేది ప్రధానంగా శబ్దానికి సంబంధించింది. శబ్దాలంకారాలు ముఖ్యం దీనివల్ల పాటకు శబ్దసౌందర్యంతో పాటు అర్థగాంభీర్యం అబ్బి, భావయుక్తంగా.. లయబద్ధంగా శ్రవణపేయంగా సాగుతుంది. ఈ పాట రచయిత వీటన్నిటితో పాటు చక్కటి రచనా శిల్పాన్ని పాటించి పాటకు కొత్త సొబగులు అద్దారు.
పల్లవిలో ఉండే శాబ్దికమైన, ఆర్థికమైన సౌందర్యాలు పరిశీలించే ముందు.. రచనాశిల్పాన్ని పరికిద్దాం. ‘మనసే హాయిగా ఏరై పారేనే’ అంటూ గీతాన్ని ఎత్తుకొని ముగింపులో.. చరణాల్లో ‘ఒక పాట ఇలా పలికెనులే.. ఆనందలోకాన నేడు’ అని నాయిక అంటే ‘అది హిందోళరాగాన చూడు’ అంటూ నాయకుడు ముగిస్తాడు. ఇందులో సాహిత్యపరంగా, సంగీతపరంగా కూడా గొప్ప విశేషాలున్నాయి. పల్లవిని, ముగింపు చరణాల్ని ముడివేసి రచనాశిల్పాన్ని ప్రదర్శించడంలో రచయిత గడుసుదనాన్ని అభినందించి తీరాలి. మనసులో హాయిగా పారే భావపరంపర ఆనందలోకాలకు తీసుకెళ్లే విశిష్టమైన ఒక గీతమిదని ధ్వనింపజేశారు. ఈ ఆనందలోకాలలో విహరించేది ఎవరు? అని ప్రశ్నిస్తే సమాధానం తెరమీది నాయికానాయకులే కాదు, ఎదురుగా కూర్చున్న ప్రేక్షకలోకం కూడా అని చెప్పకనే చెప్పారు. ఇదంతా సాహిత్యానికి సబంధించిన విశేషాలైతే.. ఇక్కడ సంగీతపరంగా ఒక రహస్యాన్ని ఇమిడ్చారు.

నాయిక ‘… ఆనందలోకాన నేడు’ అని ముగిస్తే నాయకుడు ‘అది హిందోళరాగాన చూడు’ అంటాడు. ఇక్కడ ఏరాగమైనా చెప్పొచ్చు. కానీ హిందోళ రాగం అనడంలో విశేషముంది. హిందోళరాగం స్వభావరీత్యా మనోరంజకమైంది. మోహనరాగ ఛాయకూడా కని(విని) అంతటి మనోరంజకమైన గీతం ఇది కాబట్టే అటు నటులు, ఇటు ప్రేక్షకులు ఆనందలోకాన పరవశించడం ఖాయమని రచయిత ప్రగాఢ విశ్వాసం.
ఇక పల్లవి, చరణాలలోని సౌందర్యాలను పరిశీలిద్దాం. పల్లవిలో ‘మనసే హాయిగా ఏరై పారెనే సెలయేరై పారెనే’ అనడంలో శరీర తత్త్వానికి సబంధించి శాస్త్రీయమైన విశేషం దాగి ఉంది. మనసును శాస్త్రం ఆలోచనాత్మకంగా చెప్పింది. నిర్ణయాత్మకమైంది బుద్ధి. మనసులో ఆలోచనలు అలలుగా పరంపరగా సాగుతూంటాయి. దీనినే రచయిత ‘ఏరై పారెనే’ అని చెప్పి అంతటితో ఊరుకోకుండా, ‘సెలయేరై పారెనే’ అనడంలో అసలు అందం దాగి ఉంది. సాధారణంగా పారే ఒక ఏరుకు, సెలయేరుకు ఎంతో భేదం ఉంటుంది. ఏరు మురికి నీటితో కూడా కలిసి పారుతుంది. సెలయేరు అలా కాదు. కొండలమీద నుంచో.. గుట్టలమీద నుంచో అందంగా.. ఉరవడిగా.. దూకుతుంది. ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందులో కనులకు ఆహ్లాదం కనిపిస్తుంది. శ్రవణాలకు లయబద్ధమైన ధ్వని వినిపిస్తుంది. వెరశి ఆనందం కలిగిస్తుంది. అదే రచయిత గూఢంగా చెప్పారు. మనసులో అలలుగా, తెరిపిలేకుండా కలిగే భావపరంపరలు అన్నీ అందమైనవి, ఆహ్లాదమైనవీ అని పల్లవిలోనే చెప్పి ఆ జంట మానసిక స్థితికి అద్దం పట్టారు.

‘అడుగు అడుగు తోడుగా సాగేను కాలాలుగా..’ అని చరణం సాగడంలో విశేషార్థాన్ని స్ఫురింపజేశారు. అడుగు.. అడుగు.. అనడంలో ఇక్కడ పడే ప్రతి అడుగు ఏడడుగులను గర్తుచేసిందని చెప్పినట్లయింది. అంతేకాదు, ‘సాగేను కాలాలుగా..’అనడంలో మరింత విశేషం ఉంది. అది ఏడేడు జన్మల బంధంగా నిలుస్తుందనే అర్థం స్ఫురింపజేయడం ద్వారా భారతీయ సంప్రదాయానికి పట్టంకట్టినట్లయింది.

ఎదలో రాగాలు సుధలే చిందినే… ఇలలో అందంగా కథలే రాసేనే.. ఈ చరణం కూడా ప్రత్యేకంగా చెప్పదగిందే. ఇక్కడ రాగాలు.. ఆ జంట మదిలోని అనురాగాలే! సుధలు చిందడం వల్ల ఆ అనురాగాలకు అమృతత్వం ఆపాదించినట్లయింది. అమృతమయమైన ఆ అనురాగాలు కథలుగా అవతరిస్తే అందంగా.. ఆనందంగా శాశ్వతంగా ఉంటాయనడంలో సందేహముండదుకదా! ఈ భావాన్నే ఈ చరణం చెబుతోంది.

అంత్యప్రాసలు, అనుప్రాసలు పాటకు చక్కటి తూగును, లయను కలిగిస్తుండగా.. ధ్వని ప్రధానంగా అర్థాలంకారాలు ఒక గాంభీర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇలా పాటలోని ప్రతిచరణం విశేషంగా సాగింది.

సుక్కు సంగీత దర్శకత్వంలో రవి, జయశ్రీ గళాల నుంచి మృదుమధురంగా హృదయానికి హత్తుకునేలా జాలువారిన ఈ గీతం పాటల రహదారిలో ఒక మైలురాయిలా నిలుస్తుందని చెప్పవచ్చు.

చక్రవర్తుల మురళీకృష్ణ

90304 75131

బిగ్ బాస్ లో తొలి రోజే ఏడ్చేసిన ముగ్గురు..

0

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు రియాలిటీ షో ఘనంగా ప్రారంభమైంది. అగ్ర హీరో నాగార్జున దీన్నిగ్రాండ్ గా లాంచ్ చేశారు. ఏకంగా 19మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఫుల్లీ ఓవర్ లోడ్ గా ఉన్న ఈ సీజన్ లో తొలిరోజు అలకలు, సంతోషాలు, గిల్లి కజ్జాలు మొదలయ్యాయి.

తొలి రోజు ఇంటి సభ్యుల మధ్య పరిచయాలు, వారి గురించి విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ తమ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.

యూట్యూబర్ షణ్ముఖ్(Shanmukh), నటరాజ్ మాస్టర్ , నటుడు మానస్(maanus) లు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఫీలవ్వడంపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. తమకు అందరితో కలవడానికి కాస్త టైమ్ పడుతుందని వారు చెప్పుకొచ్చారు. యాంకర్ రవి వారికి ధైర్యం చెప్పాడు.

ఇక తొలి రోజు ముగ్గురు ఏడ్చేశారు. వీరిలో మొదట ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ తను ట్రాన్స్ జెండర్ గా మారడానికి కారణాలు.. దానికి కుటుంబ సభ్యులు వద్దన్న తీరు.. నాన్నతో దీనిపై జరిగిన గొడవపై ఆర్జే కాజల్ కు చెప్పుకొన్ని కన్నీళ్ల పర్యంతం అయ్యింది. నాన్న నన్ను పట్టుకొని గడ్డాలు, మీసాలు ఏవీ అని అన్నాడని.. నేను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం ఆయనకు తెలియదని.. ఏం చెప్పాలో అప్పుడు తెలియక కళ్లల్లో నీళ్లు తిరిగాయని ప్రియాంక ఏడ్చేసింది.

ఇక ఆ తర్వాత సాయంత్రం ఎలిమినేషన్ ప్రక్రియలో ఇద్దరు ఏడ్చేశారు. ముఖ్యంగా ఇంట్లో అందరి వస్తువులు దాచేసి అల్లరి చేసిన మోడల్ జశ్వంత్ తీరును అందరూ వేలెత్తి చూపారు. దీంతో తన తప్పు లేకున్నా అందరూ నామినేట్ చేయడంపై అతడు బాగా ఏడ్చేశాడు.

ఇక మరో నటి ఫమీదా కూడా ఏడ్చేసింది. ఆమె చేష్టలకు ఇంటి సభ్యులంతా నామినేట్ చేసి తప్పును వేలెత్తి చూపడంతో కంటతడి పెట్టింది. నామినేషన్ ప్రక్రియలో అందరూ చిన్న చిన్న కారణాలతోనే నామినేట్ చేసుకోవడం కనిపించింది.

మొత్తంగా తొలిరోజే బిగ్ బాస్ హౌస్ లో కన్నీటి వరద పారింది. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్(Priyanka Singh), మోడల్ జశ్వంత్(Jashwanth), నటి ఫమీదా(Famida)లు ఏడ్చేశారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌

0

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్‌ అంతకుముందు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాల్లో పని చేశారు.

ఈ షార్ట్ ఫిల్మ్ చూసి అందరూ నేర్చుకోవాలి

0

ఇప్పుడు ఉన్న సమాజంలో బంధాలకన్నా వారి పాపులారిటీ గురుంచి ఎక్కువగా ఆలోచించే వారే ఎక్కువ. వారి ఆలోచన ధోరణి వల్ల నష్టపోయేవారు ఎంతో మంది. ఈ నేపథ్యంలో రూపొందించిన 3 నిమిషాల వ్యవధిగల షార్ట్ ఫిలిం హెల్ప్. 176 ప్రొడక్షన్స్ సమర్పణలో జి.శివ దర్శకత్వం వహించి D. పృథ్వి రామ్ గోపాల్ వర్మ నిర్మించిన షార్ట్ ఫిలిం హెల్ప్. దిమ్మీలి సూర్య, పృధ్వి తేజ ఇందులో నటించారు. సినిమాటోగ్రఫీ విద్యాసాగర్ చేసారు.
ఈ షార్ట్ ఫిలిం వ్యవధి చాలా తక్కువ అయినా కూడా దర్శకుడు మనోగతం ఏమిటో చూడగానే అర్ధమవుతోంది. ఇందులో విషయం ఏమిటంటే ఒక వ్యక్తి కరోనా మహమ్మారి వలన తన కుటుంబాన్ని కోల్పోతారు,దానితో ఎవరూ కూడా ఆ ఇంటి వైపు వెళ్ళరు. ఆ సమయంలో తనకు తినడానికి కూడా ఏమి లేకపోవడంతో తన స్నేహితుడికి కాల్ చేసి కొంత డబ్బు కావాలని అడుగుతాడు కానీ ఆ స్నేహితుడు తన దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేదని తప్పించుకుంటాడు. దాని తరువాత ఆ డబ్బులు లేవన్న స్నేహితుడు అతని మరొక స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ షార్ట్ ఫిలిం కధ.

మీరు కూడా ఈ షార్ట్ ఫిలిం ను ఓ లుక్కేయండి

https://youtu.be/a5_KcWqEmWg

‘భీమ్లా నాయక్’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

0

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. పవన్ కల్యాణ్‌, రానా కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

కాగా ఈరోజు ఈ మూవీ నుంచి బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఉదయం 11:16 గంటలకు విడుదల చేశారు.సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

చిరు నివాసం లో పీవీ సింధూకి సన్మానం

0

భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో, సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన, సీనియర్ హీరో నాగార్జున, సీనియర్ నటీమణులు రాధిక, సుహాసిని కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు అద్భుత ఘనత సాధించిందని కొనియాడారు. ఇది నా బిడ్డ సాధించిన విజయంగా భావించి సింధును సత్కరించానని వెల్లడించారు. సింధును ఆత్మీయుల మధ్య గౌరవించడం ఎంతో ఆనందాన్నిస్తోందని తెలిపారు.

మెగాస్టార్ అంతటివాడు స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి సన్మానించడం పట్ల సింధు సంతోషంతో పొంగిపోయింది. చిరంజీవి గారు ఇంటికి పిలిచి గౌరవించడం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించేందుకు కృషి చేస్తానని వెల్లడించింది.

సూపర్ స్టార్ కృష్ణ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వాలి-డా.గజల్ శ్రీనివాస్

0

సుాపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ జీవితం స్ఫుార్తిదాయక కావ్యమని గజల్ మాష్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. సుాపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం రిలీజై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. నటుడుగా, నిర్మాతగా దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుఠలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. భారతీయ చిత్ర చరిత్రలో సాంఘిక, జానపద, కౌబాయ్, చారిత్రాత్మక, జేమ్స్ బాండ్ పాత్రలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అవి అన్నారు. తెలుగు చలనచిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యిచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ ఫాన్స్ గౌరవాద్యక్షులు రాయప్రోలు శ్రీనివాస ముార్తి మాట్లాడుతూ ఇండియన్ సిరీస్ పై మొదటి కౌబాయ్ చిత్రంగా, పాన్ ఇండియా ముావీగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రంఏడు భాషలలో డబ్బు చేయబడి 125 దేశాలలో ప్రదర్శింపబడిందని అన్నారు. చైతన్య భారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షతన జరిగిన సభలో 50 కేజీల కేకును కట్ చేసారు. కృష్ణ అభిమానులుగా దశాబ్దాల పాటు అభిమాన సంఘాన్ని నడిపి, రంగస్థల నటులుగా పేరెన్నికగన్న శ్రీ మహ్మద్ ఖాజావలి, మానాపురం సత్యనారాయణ, పులఖండం ఉగాది లకు సుాపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్ అందజేసారు. సుమారు 300మంది మహిళ లకు చీట్లు పంపిణీ చేసారు. పట్టణంలోని నాగార్జున ఫాన్స్ అధ్యక్షులు.యల్.డి ప్రసాద్,ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, కృష్ణ ఫాన్స్ నాయకులు బి. హెచ్. సుబ్బరాజు, గంట్లప్రసాద్, బోనం ప్రసాద్,తాతపుాడి రాంబాబుబమడారు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

రేపు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం

0

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితులపై ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యం లోనే మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి పై చర్చించనున్నారు. అలాగే.. హుజురాబాద్‌ ఉప ఎన్నిక పై అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మా అధ్యక్షుడిగా కాదంబరి .. ?

0

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మా ఎలక్షన్ గురుంచి వార్తలు చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా వివిధ వర్గాల వారు మరొకరి పై విమర్శలు చేయడం చూస్తున్నాం,ఒకరకంగా చెప్పాలంటే నిజ రాజకీయాలను తలపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై అనేక చర్చలు నడుస్తున్నాయి. అయితే తానే కాబోయే మా ప్రెసిడెంట్ అని ముందుగానే ప్రకటించేశారు ప్రముఖ నటులు కాదంబరి కిరణ్. ఈ ప్రకటనతో చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇక అసలు విషయానికొస్తే కాదంబరి కిరణ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో మాటల సందర్భంలో మా ఎలక్షన్స్ గురుంచి విలేఖరి అడగగా తాను కూడా అధ్యక్ష పదవి బరిలో ఉన్నానని ఎంతమంది వచ్చినా కూడా గెలవబోయేది తానే అని అన్నారు. మొత్తం 900 మంది ఓటు హక్కు కలిగిన వారు ఉండగా తనకు కనీసం 300 మంది తప్పక ఓటువేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియా లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది మనం సైతం ద్వారా ఆయన చేసిన కార్యక్రమాల దృష్ట్యా ఆయన ఖచ్చితంగా గెలుపొందాలని కోరుతుండగా మరి కొందరు బండ్ల గణేష్ 2.0 గా అభివర్ణిస్తూ గెలిచిన తర్వాత అదే ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వాలని అంటున్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగం

0

జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధే ఎక్కువ ఉందని చెబుతూ కంటతడి పెట్టారు. అంబర్‌పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని.. అంబర్‌పేట బిడ్డగా అంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే అందుకు.. అంబర్ పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమని చెప్పారు. దేశానికి రాజైనా అంబర్‌పేటకు తాను బిడ్డనే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

error: Dont Copy Our Content !! To obtain a license to our content, please contact us!