<p style=”text-align: justify;”>తెలంగాణలో టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టీఎస్ టెట్-2023)కు మొత్తం 2.91 ల‌క్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తు గడువు ఆగస్టు 16తో ముగిసిన సంగ‌తి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 2,91,058 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం దరఖాస్తుల్లో పేప‌ర్-1కు 82,560 మంది అభ్యర్థులు, పేప‌ర్-2కు 21,501 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇక రెండు పేప‌ర్లకు క‌లిపి 1,86,997 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే గ‌తేడాది నిర్వహించిన టెట్‌కు 3.79 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వచ్చాయి.
<p style=”text-align: justify;”>రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 15న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ‘టెట్’ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
<p style=”text-align: center;”><a title=”తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/jobs/ts-tet-2023-notification-out-check-eligibility-exam-pattern-and-qualifying-marks-here-107789″ target=”_blank” rel=”noopener”>తెలంగాణ టెట్ పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..
<span style=”color: #ff00ef;”>ముఖ్యమైన తేదీలు..
➥ టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.
➥ హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో: 01.08.2023 – 15.08.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.
➥ టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.
పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
<p style=”text-align: center;”><span style=”font-size: 18pt;”><a href=”https://tstet.cgg.gov.in/TSTETWEB2022/viewPDF?fileName=/Uploads/ORPSdocs/Documentscm/TSTET/25165_docs_TSTET2023/circulars/25165_2324_tstet2023_noti.pdf” target=”_blank” rel=”nofollow noopener”>Notification – TSTET 2023
<p style=”text-align: center;”><span style=”font-size: 18pt;”><a href=”https://tstet.cgg.gov.in/TSTETWEB2022/viewPDF?fileName=/Uploads/ORPSdocs/Documentscm/TSTET/25165_docs_TSTET2023/circulars/25165_514_2324_tstet2023_circ.pdf” target=”_blank” rel=”nofollow noopener”>Information Bulletin 
<p style=”text-align: justify;”><span style=”text-decoration: underline;”>ALSO READ:
<p style=”text-align: justify;”><span style=”color: #ff00ef;”>IBPS PO: 3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
<a title=”నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/jobs/ibps-has-released-crp-po-mt-xiii-notification-with-3049-posts-apply-now-107668″ target=”_blank” rel=”nofollow nofollow noopener”>నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
<p style=”text-align: justify;”><span style=”color: #ff00ef;”>1402 పోస్టులతో ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత, తగు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
<a title=”నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/jobs/ibps-crp-spl-xiii-notification-2023-released-with-1402-posts-apply-now-107686″ target=”_blank” rel=”nofollow nofollow noopener”>నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
<p style=”text-align: center;”><a title=”మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి…” href=”https://telugu.abplive.com/jobs” target=”_blank” rel=”nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow noopener”>మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్<a title=”మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి…” href=”https://telugu.abplive.com/jobs” target=”_blank” rel=”nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow noopener”> చేయండి..
TS TET-2023: ‘టెట్’కు 2.91 లక్షల మంది దరఖాస్తు, ‘పేపర్-1’కే ఎక్కువ అప్లికేషన్లు
Date: