నేడు “అనగనగా ఒక కథ” ట్రైలర్ విడుదల

0
193


రంగు రంగుల చిత్రాల హంగుల మధ్యలో మనం మర్చిపోయిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలోని అందాన్ని మనకి మళ్ళీ గుర్తు చెయ్యడానికి ఒక ఇండిపెండెంట్ సినిమా రాబోతుంది.
” ది స్టోరీటెల్లేర్’స్ థియేటర్ ” నిర్మాణ సంస్థ నుండి, శృతి పైలా సమర్పణలో , ” అనగనగా ఒక కథ ” అనే ఇండిపెండెంట్ చిత్రం ఈ నెల ఆగష్టు 25న యూట్యూబ్ లో రిలీజ్ అవ్వబోతుంది. దీని ట్రైలర్ ని ఈరోజు ” ది స్టోరీటెల్లేర్’స్ థియేటర్ ” యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వల్లిష్ మరియు శివ.జి ముఖ్య పాత్రలు పోషించగా, విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ చేశారు, సంగీతం మరియు ఆడియోగ్రఫీ ది తేజ్ అనే కొత్త కుర్రోడు చేసాడు. సాయి సతీష్ (బన్నీ) వాయిస్ యాక్టర్ గా తన సేవలు అందించాడు ఈ చిత్రానికి . అతి తక్కువ బడ్జెట్ లో, ముగ్గురు మనుషులు కలిసి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఎన్నో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఈ మధ్య కాలం లో వచ్చిన. ” ఫిలిం నోయిర్ ” జోనర్ లో వస్తున్న తొలి ఇండిపెండెంట్ చిత్రం ఈ ” అనగనగా ఒక కథ “. తమ ఈ ప్రయత్నానికి జనాల సహాయ సహకారాలు అందితే మరిన్ని అందమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తామని చిత్ర బృందం తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here