కేటిఆర్ జన్మదినం సందర్బంగా మొక్క నాటిన దాసోజు శ్రవణ్,ఎమ్మెల్యే బాల్క సుమన్

Date:

రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ కేక్ కట్ చేసి, రక్త దాన శిబిరం ప్రారంభించడం జరిగింది. అనంతరం కేటీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ ఛైర్మెన్లు, కట్టెల శ్రీనివాస్ యాదవ్ మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ .. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేడు కేటీఆర్ పేరు మారుమోగుతుందన్నారు. కేటీఆర్ రాజకీయ చతురత, మాటలతో ఓటర్లను ఆకట్టుకునే వాగ్దాటి, వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయుడు, యువతరానికి స్ఫూర్తి, వేదిక ఏదైనా ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడి ప్రపంచాన్ని మైమరపింపజేసే ఘనుడు అంటూ చెప్పుకొచ్చారు. గెలుపునకు షార్ట్ కట్స్ ఉండవు అని నమ్మి.. లక్షసాధనగా అడుగుల్లో వేగం పెంచుతూ ప్రజలకు చేరువుగా ఉంటుంది లీడర్ కేటీఆర్ అని అన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ది ఓ ప్రత్యేక స్థానం అని చెప్పాలిన పనిలేదు. మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలుసిసలు తెలంగాణవాది కేటీఆర్. లోకల్‌ టు గ్లోబల్‌ ఏ విషయమైనా వేగంగా స్పందించే గుణం ఆయనది. అందుకే ఆయన్నంత అందరు ‘రామన్న’ అని పిలుస్తుంటారు. తండ్రి సీఎం కేసీఆర్‌కి తగ్గ తనయుడిగా నేటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ యాంగ్ & డైనమిక్ లీడర్ అని వరల్డ్ వైడ్ గా కేటీఆర్ ను పిలుచుకుంటున్నారనీ శ్రవణ్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తండ్రి కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ మడమతిప్పని పోరాటం చేశారు. 2009లో మొదటిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడలేదు. తిరిగి 2010 ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 2014 నుంచి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్విర్తిస్తున్నారు.

2018లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొంటూ ముందుకుసాగుతున్నారు. కేటీఆర్‌ ఆలోచనలు ఎప్పుడూ వినూత్నంగానే ఉంటాయి. సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడంతోపాటు వాటికి తగిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంటారు. మంత్రి కేటీఆర్‌ ఆలోచనలతో పురుడుపోసుకున్న ఆవిష్కరణలు ఎన్నో. అందుకు హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో డాక్టర్‌ సైరస్‌ పూనావాలా ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ అండ్‌ పాండమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ సెంటర్‌ నిదర్శనం.

అంతే కాదు మిషన్‌ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ రూపొందించగా, దానిని విజయవంతంగా అమలు చేయడంలో కేటీఆర్ కీలకభూమిక పోషించారు. వరదల నివారణకు చేపట్టిన స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌, ట్రాఫిక్‌ నివారణకు చేపట్టిన స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌, నగరవాసుల కోసం ఓపెన్‌ జిమ్‌లు, అర్బన్‌ పార్క్‌లు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు కేటీఆర్ శ్రీకారం చుట్టినట్లు శ్రవణ్ పేర్కొన్నారు. మరోసారి
కేటీఆర్ కు 47 వ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ భవిష్యత్ లో ఇంకా ఎంతో ఎత్తుకు కేటీఆర్ ఎదగాలని శ్రవణ్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

Popular

More like this
Related

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు తెలంగాణ వీణ...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బేబీ’

ముక్కోణపు ప్రేమ కథతో.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ కొట్టింది...

నేడు “అనగనగా ఒక కథ” ట్రైలర్ విడుదల

రంగు రంగుల చిత్రాల హంగుల మధ్యలో మనం మర్చిపోయిన బ్లాక్ అండ్...

సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి- ఎందుకిలా? అసలేం జరిగింది?

<p>ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు...
error: Dont Copy Our Content !! To obtain a license to our content, please contact us!