గ్రౌండ్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా ఆడియన్స్ చూసేది నన్నే: ‘వారసుడు’ ట్రైలర్ రిలీజ్!

279

తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి తెలియనిది కాదు. ఇక తెలుగులోనూ ఆయన మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి ఆయన తెలుగు దర్శక నిర్మాతలతో ఒక సినిమా చేశాడు .. అదే ‘వారసుడు’. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపాలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తమిళ … తెలుగు భాషల్లో ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 
ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం పాలిట విలన్ గా తయారవుతాడు ప్రకాశ్ రాజ్. అతన్ని ఎదిరించి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. 

విజయ్ సరసన నాయికగా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా అయిన సంగతి తెలిసిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here