యండమూరికి చంద్రబోస్ స్ట్రాంగ్ కౌంటర్…

876

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోని పాటలు అన్నీ విడుదల అయ్యి మంచి ఆదరణను పొందుతున్నాయి. ముఖ్యంగా మూడు రోజుల క్రితం విడుదల అయిన చిత్రం టైటిల్ సాంగ్ అటు సంగీతాభిమానులతో పాటు సాహిత్యాభిమానులను సైతం కట్టి పడేసింది, ముఖ్యంగా ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం అనేక వర్ణనలతో ఆ పదాలను శోధించాలి అనే విధంగా ఉంది.

ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ ను ఎంతో మంది అభినందిస్తుండగా ప్రశంస పక్కనే విమర్శ అన్నట్టుగా వ్యతిరేకించే వారు ఉన్నారు. ముఖ్యంగా గొప్ప రచయితగా పేరు సంపాదించిన యండమూరి వీరేంద్రనాథ్ పేస్ బుక్ పోస్ట్ ద్వారా చేసిన విమర్శ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసినదే. ఈ పాటలోని రెండు పంక్తులను ముఖ్యంగా చూపిస్తూ అసలు రచయితకు వ్యాకరణం తెలుసా అంటూ చేసిన విమర్శ చాలా చర్చలకు దారితీసింది.

అయితే ఇప్పుడు ఈ విమర్శకు చంద్రబోస్ ఘాటుగా తనదైన శైలిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ పాటలో చాలా అంతరార్ధం ఉందని ఎంతో గొప్ప వాళ్ళు తనకు కాల్ చేసి అభినందిస్తున్నారని అన్నారు, ముఖ్యంగా “తుఫాను అంచున తపస్సు చేసే.. వశిష్ఠుడంటే అది వీడే” అనే పంక్తి ఏ విధంగా తాను ఉపయోగించారో తెలిపారు. ఈ పాట మొత్తం విరోధాభాసాలంకారంలో తాను రాశానని తనకు వశిష్ఠుడి చరిత్ర మొత్తం తెలుసని సినిమా పాట రాయడం అంటే అనుకున్నంత తేలిక కాదని అన్నారు.

“తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే” అనే పద ప్రయోగం మీద కూడా వీరేంద్రనాధ్ విమర్శిస్తూ తిమిర నేత్రం అంటే గుద్ది కన్ను అది కూడా రచయితకు తెలియదా అనగా ఒక రచయితకు వేరే రచయితకు దాని అర్ధం తెలియదు అనుకోవడమే తిమిరం అని చంద్రబోస్ స్పందించారు. ఈ పాట సాహిత్యం చూసిన వెంటనే చిరంజీవే స్వయంగా తనను అభినందిస్తూ వాట్స్ ఆప్ లో సందేశం పంపారని ప్రముఖ రచయత సత్యానంద్ కూడా తనకు కాల్ చేసి ఎంతో అభినందించారని చంద్రబోస్ తెలిపారు, తాను ఎంతో కష్టపడి రాసిన పాటకు అభినందనలు తెలుపకపోగా ఈ విధంగా అసలు విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం పై అసహనం వ్యక్తం చేశారు.

ఈ విధంగా చంద్రబోస్ గారు వివరణ ఇవ్వడం ద్వారా సాహిత్యం పై మక్కువ ఉన్నవారికి కొత్త విషయాలు తెలిసాయి అనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here