రక్తంతో ప్రభాస్ పెయింటింగ్..వైరల్ అవుతున్న వీడియో

235

అభిమాని లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఒక సినిమాలో పాడతాడు. అది అక్షర సత్యం.. ఒక హీరో ఎన్ని సినిమాలు తీసినా అభిమానులను సంపాదించుకోలేకపోతే ఆ హీరోకు విలువ ఉండదు.

ఇక అలాంటి అభిమానాన్ని సంపాందించుకున్న హీరోలందరూ ఎంతో గ్రేట్. ఇక టాలీవుడ్ అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో ప్రభాస్ ఒకడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ జర్నీ ఎంతోమందికి ఆదర్శం. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ప్రభాస్ సైతం అభిమానులకు ఏదైనా కష్టం వస్తే ముందు ఉంటాడు.

ఇక మొన్నటికి మొన్న కృష్ణంరాజు మృతి చెందినప్పుడు.. అంత బాధలో ఉన్నా కూడా ఫ్యాన్స్ ను అన్నం తిని వెళ్లమని చెప్పడం అంటే మాములు విషయం కాదు. అది డార్లింగ్ వ్యక్తిత్వం. ఇక అలాంటి హీరో కోసం ఒక ఫ్యాన్ తన రక్తాన్నే త్యాగం చేశాడు. ప్రభాస్ పుట్టినరోజుకు ప్రభాస్ ఫ్యాన్స్ ను రక్తదానంకు పిలుపునిస్తూ తన రక్తాన్ని తీసి .. ఆ రక్తంతో ప్రభాస్ పెయింటింగ్ వేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో డార్లింగ్ ఫ్యాన్ పేరు లాల్ ప్రసాద్ అని తెలుస్తోంది. అతనే తన రక్తాన్ని తీసుకొని ప్రభాస్ పెయింటింగ్ వేసి.. రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అని రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అని కామెంట్స్ పెడుతున్నారు. పుట్టినరోజుకు ముందే ఇంత రచ్చ చేస్తుంటే ఇక ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 న ఈ ఫ్యాన్స్ ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here