గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్

177

“భారత రత్న” లతా మంగేష్కర్ జన్మ దినోత్సవ సందర్భంగా మై హోమ్ ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ను ” సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం” జ్ఞాపిక , 21,000 వేల పురస్కార పారితోషకం తో పూణే నగరంలో శ్రీ యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియం లో వేలాది మంది సమక్షంలో విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు శ్రీ ప్రశాంత్ దామ్లే , చేతుల మీదుగా సత్కరించి అవార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ సునీల్ దేవధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రంలో డా.గజల్ శ్రీనివాస్ శ్రీ లతా మంగేష్కర్ పై శ్రీ రాజేంద్ర నాథ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, శ్రీ రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజళ్ళు గానం చేసి లతాజి కి గాన నీరాజనం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here