బీజేపీ లో చేరిన దాసోజు శ్రవణ్

Date:

బిజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి   మురళిధర్ రావు, బిజెపి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరిన దాసోజు శ్రవణ్.

*1500వందల మంది బిడ్డల రక్త తర్పణం తర్వాత అనేక మంది పోరాటాల, లాఠీ దెబ్బలు తిన్న తర్వాత రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందనే గొప్ప విశ్వాసం ఉద్యమం చేశాం. కానీ దురదృష్టవశాత్తు కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ దుర్మార్గులపాలైయింది. 

*అరవై ఏళ్లలో 60 వేల కోట్లు అప్పువుంటే కేవలం ఎనిమిదేళ్ళలో 4 లక్షల కోట్లు అప్పు చేసిన భవిష్యత్ లో పుట్టబోయే తెలంగాణ బిడ్డలపై కూడా అప్పు మోపి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేచేసిన నీచమైన పాలన తెలంగాణలో సాగుతోంది 

*అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ మేడి పండు అభివృద్దిని చూపించి ప్రజలని బ్రాంతికి గురి చేస్తున్నారు

*నీళ్ళు, నిధులు, నియామకాలు,  ఆత్మ గౌరవం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైయింది. కానీ నేడు ఉద్యమ లక్ష్యాలని తూట్లు పొడుస్తూ కేసీఆర్ అరాచర పాలన చేస్తున్నారు.

*పాలమూరు, మెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, దిండి, ఎస్ఎల్ బీసి ఇలా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. పూర్తయినట్లు కనిపిస్తున్న ప్రాజెక్ట్ కాళేశ్వరం. 35 వేల కోట్ల రుపాయిలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ 1లక్షా 50 వేల కోట్లుకి తీసుకెళ్ళి .. కాళేశ్వరంని  కేసిఆర్ కు కమీశనేశ్వరంగా మార్చేశారు.

 *బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగాలు వున్నాయని చెప్పిన తర్వాత కూడా 80 వేల ఉద్యోగాలు మాత్రమే నియమిస్తామని చెప్పి వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా నోటీఫీకేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల పాలిత శాపంగా మారారు 

*బీఎస్, ఎస్సి, ఎస్టీ , మైనారిటీ కార్పోరేషన్స్ లో లక్షల కొద్ది అప్లికేషన్ లు మూలుగుతున్న ఒక్కరికి లోన్ లు ఇవ్వలేదు. తెలంగాణలో 40 లక్షల మంది చదువుకున్న యువత బిచ్చగాళ్ళుగా మారిపోయిన దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు కేసీఆర్

* 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా వున్నా భర్తీ చేయడం లేదు. బాసర లాంటి ప్రతిష్టాత్మక సంస్థలోనే బోధన సిబ్బంది లేదు. నాలుగు వేల ప్రభుత్వ స్కూల్స్ ని మూసేశారు. స్కూల్స్ లో వసతులు లేవు. కార్పోరేట్ విద్య సంస్థల ఆగడాలని అడిగే నాధుడు లేడు.

* వైద్య వ్యవస్థని నాశనం చేశారు. ఆరోగ్య శ్రీ లేదు. 108 లేదు. వైద్యుల నియామకాలు లేవు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన అయుష్మాన్ భవ లాంటి పధకం ని కూడా అమలు చేయకుండా తెలంగాణ పాలిట శాపంగా మారారు

*అవినీతి రహిత పాలన చేసుకోవాలనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ నేడు టీఆర్ఎస్ అవినీతి ఏ స్థాయిలో వుందంటే.. తెల్ల రేషన్ కార్డ్ వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు  నేడు కోట్ల రూపాయిలు అవినీతిగా సంపాయించుకొని కార్లు బంగ్లాలు, ప్యాలెసులతో అవినీతి బకాసురులుగా మారిపోయారు. 

*సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెబుతూనే.. తెలంగాణలోని ప్రతి పల్లెలో బెల్టు షాపులు పెట్టి తాగుబోతుల తెలంగాణగా మర్చి పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నారు.

*తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందని చోకోటి ప్రవీణ్ ఉదంతం నిదర్శనం. టీఆర్ఎస్ నాయకులు అతడిని భుజాన వేసుకొని నడుస్తున్నారు. ఇంతకంటే సిగ్గు చేటు లేదు. 

”పదేళ్ళుగా అవినీతి పాలన చేసిన కేసీఆర్ పనైపోయింది. తెలంగాణ అధికార మార్పిడి జరిగి, కేసీఆర్ గద్దె దిగాల్సిన చారిత్రాత్మ అవసరం వుంది. కేసీఆర్ ని గద్దె దించుతూ నిస్వార్ధమైన యోగి నరేంద్రమోడీ నేతృత్వంలో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెస్తూ .. ప్రో. జయశంకర్ తో పాటు అమరవీరుల త్యాగాలని పోరాటాలని సఫలీకృతం చేసేరీతిలో సబ్బండ వర్గాలు సామాజిక న్యాయం, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించే రీతిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పని చేస్తాను.” అని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.

ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ , మధ్య ప్రదేశ్ ఇంచార్జ్   మురళిధర్ రావు, బిజెపి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు  వివేక్ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు దాసోజు శ్రవణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివేక్ కండువా కప్పి దాసోజు శ్రావణ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. దాసోజు శ్రావణ్ కు తరుణ్ చుగ్ పార్టీ సభత్వం ఇచ్చారు. శ్రవణ్ తోపాటు ఆయన మద్దతదారులు పలువురు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ సిద్దాంతాలని బలంగా తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తూ నన్ను ఎంతో ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ , మాజీ ఎంపీ వివేక్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి   మురళిధర్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను బిజెపిలోకి రావాలని కోరుకున్న వారు, వచ్చిన తర్వాత  శుభాకాంక్షలు తెలియసేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా పని చేశాను. తర్వాత విద్యార్ధి పరిషత్ కార్యకర్తగా ఆర్ట్స్ కాలేజీ జనరల్ సెక్రటరిగా పని చేశాను.  సొంత ఇంటికి వచ్చిన భావనతో భారతీయ జనతాపార్టీలో  చేరుతున్నాను” అన్నారు 

” తెలంగాణ రాష్ట్రం అశామాసీ రాష్ట్రం కాదు. 1500వందల మంది బిడ్డల రక్త తర్పణం తర్వాత అనేక మంది పోరాటాల, లాఠీ దెబ్బలు తిన్న తర్వాత రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందనే గొప్ప విశ్వాసం ఉద్యమం చేశాం. కానీ దురదృష్టవశాత్తు కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ దుర్మార్గులపాలైయింది. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు అప్పుల రాష్ట్రంగా మారింది. అరవై ఏళ్లలో 60 వేల కోట్లు అప్పువుంటే కేవలం ఎనిమిదేళ్ళలో 4 లక్షల కోట్లు అప్పు చేసిన భవిష్యత్ లో పుట్టబోయే తెలంగాణ బిడ్డలపై కూడా అప్పు మోపి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేచేసిన నీచమైన పాలన తెలంగాణలో సాగుతోంది. అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ మేడి పండు అభివృద్దిని చూపించి ప్రజలని బ్రాంతికి గురి చేస్తున్నారు.” అన్నారు 

”నీళ్ళు, నిధులు, నియామకాలు,  ఆత్మ గౌరవం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైయింది. కానీ ఇవాళ పాలమూరు, మెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, దిండి, ఎస్ఎల్ బీసి ఇలా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. పూర్తయినట్లు కనిపిస్తున్న ప్రాజెక్ట్ కాళేశ్వరం. 35 వేల కోట్ల రుపాయిలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ 1లక్షా 50 వేల కోట్లుకి తీసుకెళ్ళి .. కాళేశ్వరంని  కేసిఆర్ కు కమీశనేశ్వరంగా మార్చేశారు. నిధులు విషయానికి వస్తే రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని దుర్భర పరిస్థితికి తీసుకొచ్చి ఉద్యమ లక్ష్యాన్ని దెబ్బతీశారు. బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగాలు వున్నాయని చెప్పిన తర్వాత కూడా 80 వేల ఉద్యోగాలు మాత్రమే నియమిస్తామని చెప్పి వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా నోటీఫీకేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల పాలిత శాపంగా మారింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, టీఎస్ ఐపాస్ తో 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ లేదు, బీఎస్, ఎస్సి, ఎస్టీ , మైనారిటీ కార్పోరేషన్స్ లో లక్షల కొద్ది అప్లికేషన్ లు మూలుగుతున్న ఒక్కరికి లోన్ లు ఇవ్వలేదు. తెలంగాణలో 40 లక్షల మంది చదువుకున్న యువత బిచ్చగాళ్ళుగా మారిపోయిన దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు కేసీఆర్. చాలా మంది ఆత్మనూన్యత భావానికి లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొనడం అత్యంత బాధాకరం. ఆత్మగౌరవం లేకుండా ప్రజస్వామం పక్కన పెట్టిన నిరంకుశ పాలన చేస్తూ తెలంగాణ పోలీసు రాజ్యంగా మార్చారు.” అని విమర్శించారు. 

విద్య వ్యవస్థ సర్వ నాశనం చేశారు. 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా వున్నా భర్తీ చేయడం లేదు. బాసర లాంటి ప్రతిష్టాత్మక సంస్థలోనే బోధన సిబ్బంది లేదు. కేసీఆర్,  కేటీఆర్ వారి పిల్లలని సిబ్బంది లేని చోట చదివిస్తారా ? నాలుగు వేల ప్రభుత్వ స్కూల్స్ ని మూసేశారు. స్కూల్స్ లో వసతులు లేవు. కార్పోరేట్ విద్య సంస్థల ఆగడాలని అడిగే నాధుడు లేడు. ఫీజు రీఅంబర్స్ మెంట్ లేదు. పేద, మధ్య తరగుల నడ్డి విరిచి కనీసం చదువుకునే అవకాశం కూడా కల్పించడం లేదు కేసీఆర్. వైద్య వ్యవస్థని నాశనం చేశారు. ఆరోగ్య శ్రీ లేదు. వైద్యుల నియామకాలు లేవు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన అయుష్మాన్ భవ లాంటి పధకం ని కూడా అమలు చేయకుండా తెలంగాణ పాలిట శాపంగా మారారు కేసీఆర్.” అని పేర్కొన్నారు. 

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెబుతూనే.. తెలంగాణలోని ప్రతి పల్లెలో బెల్టు షాపులు పెట్టి తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మర్చి పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నారు. అవినీతి రహిత పాలన చేసుకోవాలనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ నేడు టీఆర్ఎస్ అవినీతి ఏ స్థాయిలో వుందంటే.. తెల్ల రేషన్ కార్డ్ వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు కోట్ల రూపాయిలు అవినీతిగా సంపాయించుకొని కార్లు బంగ్లాలు, ప్యాలెసులతో అవినీతి బకాసురులుగా మారిపోయారు. తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందని చోకోటి ప్రవీణ్ ఉదంతం నిదర్శనం. టీఆర్ఎస్ నాయకులు అతడిని భుజాన వేసుకొని నడుస్తున్నారు. ఇంతకంటే సిగ్గు చేటు లేదు.” అని విమర్శించారు. 

మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వస్తే ప్రజల బ్రతుకులు మొరుగౌతాయని అలుపెరుగని ఉద్యమం చేశారు. కేసీఆర్ ఉద్యమకారులందరినీ పక్కన పెట్టేశారు. ఆయన కేబినేట్ లో అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళే. ఎంతో మంచి వ్యక్తి, మేధావి వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ ని కూడా కేసీఆర్ పక్కన పెట్టారు. శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా అద్భుతంగా పని చేశారు,  గొప్ప వ్యక్తిత్వం, కష్టపడే గుణం, పరిజ్ఞానం వున్న శ్రవణ్ లాంటి నాయకులు బిజెపిలోకి రావడం బిజెపి బలం చేకూరినట్లయింది. శ్రవణ్ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పని చేసిన అనుభవం వుంది. బిజెపి ని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచన ఆయనలో వుంటుంది. శ్రవణ్ బిజేపిలోకి రావడం ఖచ్చితంగా అదనపు బలం చేకూరినట్లయింది” అన్నారు.

డా. దాసోజు శ్రవణ్ తో పాటు దాసోజు రవిచందర్, శ్రీనివాస్ ఆచార్య, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముంజాగల్ల విజయ కుమార్,డిడి ఎజ్రా శాస్త్రి, పీటర్ నే్లీష్టల్, మధు కుమార్ బొడ్డుపల్లి, బి.అంజయ్య, అనీష్ గంగపుత్ర యువజన కాంగ్రెస్ నాయకులు బిజెపిలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

Popular

More like this
Related

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు తెలంగాణ వీణ...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బేబీ’

ముక్కోణపు ప్రేమ కథతో.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ కొట్టింది...

నేడు “అనగనగా ఒక కథ” ట్రైలర్ విడుదల

రంగు రంగుల చిత్రాల హంగుల మధ్యలో మనం మర్చిపోయిన బ్లాక్ అండ్...

సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి- ఎందుకిలా? అసలేం జరిగింది?

<p>ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు...
error: Dont Copy Our Content !! To obtain a license to our content, please contact us!