కొత్త లుక్ లో మంత్రి రోజా

254

ఆటోవాలా అవతారమెత్తారు ఏపీ మంత్రి రోజా. తిరుపతిలో వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి రోజా.. ఖాకీ షర్ట్ ధరించి ఆటో నడిపారు. ఆటోలో ఎంపీ గురుమూర్తితో పాటు ఆటో నడిపే మహిళలు ఉన్నారు.

ఏపీ మంత్రి రోజా.. ఆటోవాలా అవతారం ఎత్తారు. కాకీ షర్ట్ ధరించి.. ఎంపీ గురుమూర్తిని ఎక్కించుకొని ఆటో నడిపారు. ఆటోవాలా మాదిరిగా ఖాకీ చొక్కా వేసుకొని రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. ఎంతో అనుభవమున్న ఆటో డ్రైవర్ మాదిరిగా పరుగులు పెట్టించారు రోజా. ఈ సీన్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ర‌వాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహ‌న మిత్ర ప‌థ‌కాన్ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెండోసారి ప్రారంభించారు. తిరుప‌తిలో ఈ కార్యక్రమం ప్రారంభ‌మ‌యింది. వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు మంత్రి రోజా చెక్కులు పంపిణీ చేశారు. మహిళా ఆటో డ్రైవర్లకు మంత్రి స్ఫూర్తినిచ్చారు. జ‌గ‌న్ ప్రభుత్వం ప్రజ‌ల ప్రభుత్వమ‌ని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా.. ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా మంచి చదువులు చదవాలన్నారు. వాహనమిత్ర కింద.. ఆటో డ్రైవర్లకు నాలుగు విడుతలుగా ఒక్కొక్కరికీ రూ.40వేలు జమ చేసినట్లు తెలిపారు మంత్రి రోజా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here