17,18 వ తేదీల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు

249

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్​ మహంకాళి దేవాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్​ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17,18 వ తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వారంలోగా ఆలయంలో చేపట్టిన పనులను పూర్తి చేయనున్నట్లు తెలియచేశారు. ఉజ్జయిని మహంకాళి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here