రేపే ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

220

రామ్ – లింగుసామి కాంబినేషన్లో ‘ది వారియర్’ సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంలో 28 మంది సెలబ్రిటీలను ఆహ్వానించి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఘనంగా నిర్వహించారు.

ఇక ఇప్పుడు తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ – జేఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. టాలీవుడ్ నుంచి ఈ వేడుకకు ఏయే సెలబ్రిటీలు హాజరవుతారనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి నటించగా, కీలకమైన పాత్రలో నదియా కనిపించనుంది. ‘రెడ్’ ఫ్లాప్ తరువాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ కి ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here