ఆసక్తికరంగా ఆది బ్లాక్ మూవీ ట్రైలర్

3646

ఆది సాయికుమార్ హీరోగా బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్ క్రియాశీలక పాత్రలో రూపొందిన చిత్రం “బ్లాక్”. ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ నిర్మించగా నూతన దర్శకుడు జి.బి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ ట్రైలర్ ను గమనిస్తే ఆది పోలీస్ పాత్రలో అనుకోని సంఘటనలు ఎదురుకొని ఆ సవాళ్ళను ఎలా ఛేదిస్తాడు అనేది మూవీ స్టోరీ లైన్ గా అర్ధమవుతుంది. ఒక రోబెరీ,మర్డర్ కేసు చుట్టూ ఈ కధ అల్లుకుంది. ఈ కధలో అనేక ఊహించని ట్విస్టులు ఉన్నట్టు ట్రైలర్ ను బట్టి మనం అర్థంచేసుకోవచ్చు. ఈ చిత్రంలో బిగ్ బాస్ కౌషల్ పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేశారు. దర్శకుడు జి.బి కృష్ణ కొత్త దర్శకుడు అయినా కూడా ట్రైలర్ చూస్తే ఎక్కడా కూడా అలా అనిపించట్లేదు, సాంకేతికవర్గ పని తీరు కూడా చాలా బాగుంది.

ఈ ట్రైలర్ లో మరో ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సరైన రీతిలో ఆ ఎమోషన్స్ కు తగట్టు మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో ఆమని, పృద్వీ రాజ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది నటించారు. ఈ సినిమాలో డైలాగులు కూడా బాగున్నట్టు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. సామాన్యంగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు చాలా ఆసక్తిగా ఉంటాయి,అదే కోవలో ఈ బ్లాక్ మూవీ కూడా ఉన్నట్టు అర్ధమవుతోంది.

ఈ చిత్రం ఆది సాయికుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా అవ్వాలని మరో ముఖ్య పాత్రలో నటించిన కౌషల్ యాక్టింగ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవ్వాలని కోరుకుందాం. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న నూతన దర్శకుడు జి.బి.కృష్ణ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకొని మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు రూపొందించాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here