ఎన్టీఆర్ కు వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు

117

ఎన్టీఆర్.. ఇవాళ 40వ పడిలోకి అడుగుపెట్టేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ సూపర్ సక్సెస్ తో పుట్టినరోజును జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకున్నాడు. ఆ చినరామయ్యకు తెలుగు సినీ ప్రంపంచం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎవరెవరు ఏమన్నారంటే…

చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్య నటప్రస్థాన అభివృద్ధి రస్తు – పరుచూరి గోపాలకృష్ణ
మా భీమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. – ఆర్ఆర్ఆర్ మూవీ
పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్.. నువ్వంటే ఎంతో అభిమానం. నీకు ఇంకా రుణపడే ఉన్నా. – హరీశ్ శంకర్
పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్ అన్నా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నా. – తమన్
బ్లాక్ బస్టరే పో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు టైగర్ తారక్. చంపేశావ్. – రామ్ పోతినేని
పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్. ఆర్ఆర్ఆర్ సమయంలో నిన్ను కలిసి నీతో మాట్లాడడం చాలా సంతోషమనిపించింది. ఇలాగే అందరి మనసులు గెలుచుకుని ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా – అజయ్ దేవ్ గణ్
తారక్ అన్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా ప్రేమ, విజయం, సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – సాయి ధరమ్ తేజ్
హ్యాపీ బర్త్ డే నా ప్రియమైన బాద్ షా. ‘నిన్ను చూడాలని’ మొదటి రోజు దగ్గర్నుంచి యంగ్ టైగర్ ‘పాన్ ఇండియా టైగర్’ వరకు తారక్ ఎదుగుదలకు నేను ప్రత్యక్ష సాక్షిని. కొమురం భీముడో పాటలో మీ నటనతో కన్నీళ్లు వచ్చేలా చేశారు. మీరు మరెన్నో ఎత్తులకు ఎదగాలని, మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నా. – శ్రీను వైట్ల
ప్రియమైన తారక్ అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. – నాగశౌర్య
ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే నా ప్రియమైన తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్టీఆర్30 చాలా భయంకరంగా కనిపిస్తోంది. అగ్నిపర్వతం లాంటి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నా. – మెహర్ రమేశ్
హ్యాపీ బర్త్ డే తారక్. – ఈషా రెబ్బ
తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్టీఆర్ 30 ఉగ్రరూపం అత్యద్భుతం. ఎన్టీఆర్31 కోసం ఎదురుచూస్తున్నాం. ఈ ఏడాదంతా మంచే జరగాలి. – గోపీచంద్ మలినేని
ప్రతిభకు పవర్ హౌస్ లాంటి యంగ్ టైగర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నా. – బాబీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here