రాజ్యసభ లిస్టులో అలీ పేరును తప్పించడంపై స్పందించిన అలీ

290

గత ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాల మధ్య నటుడు అలీ వైసీపీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఎదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా అదంతా గాలి వార్తలుగానే మిగిలిపోతున్నాయి.

ఇటీవల అలీని క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడారు జగన్. త్వరలోనే గుడ్ న్యూస్ వింటావ్ అంటూ అలీ భుజం తట్టారు. అలీని రాజ్యసభకు పంపడం ఖాయమని వైసీపీ శిబిరం ప్రచారం చేసింది. అక్కడ కూడా ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఏపీ నుంచి నలుగురిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఈ లిస్టులో అలీ లేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. తాను రాజ్యసభ సీటును ఆశించలేదని వెల్లడించారు. ‘‘జగన్ దృష్టిలో తాను ఉన్నానని చెప్పారు. భవిష్యత్‌లో ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాన్న అలీ.. నీకు ఫలానా పదవి ఇస్తామని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదని చెప్పారు. ఏదో ఒక పదవి ఇస్తామని గట్టిగా చెప్పారని.. ఆ నమ్మకంతోనే ఉన్నానన్నారు అలీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here