ఘనంగా ఆది పినిశెట్టి వివాహం

301

ప్రముఖ దక్షిణాది నటుడు, సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. ఆది పినిశెట్టి వివాహం నటి నిక్కీ గల్రానీతో ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాలులో వీరి వివాహ మహోత్సవం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరిమితంగా అతిథులను ఆహ్వానించారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి విచ్చేశారు. కాగా, టాలీవుడ్ లో ఆది పినిశెట్టికి సన్నిహితులైన హీరోలు నాని, సందీప్ కిషన్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. 

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరు ప్రేమించుకుంటున్న విషయం ఇటీవలే వెల్లడైంది. కొన్నివారాల కిందటే నిశ్చితార్థం కూడా జరిగింది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ తమిళంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ విధంగా జరిగిన పరిచయం, ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here