ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం’ ఫస్టులుక్ రిలీజ్!

86

అల్లరి నరేశ్ ఇకపై విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆయన చేసిన ‘నాందీ’ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత  సినిమాగా ‘సభకు నమస్కారం’ చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రాజెక్టు మొదలైంది. 

జీ స్టూడియోస్ వారితో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించగా, రాజమోహన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున తనకి గాయాలు అయినప్పటికీ, మరో వైపున మరొకరిని కాపాడే ప్రయత్నంలో అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. 

ఈ సినిమాలో ఆనంది కథానాయికగా నటించింది. ‘జాంబీ రెడ్డి’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆనంది, ఈ సినిమా తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తోంది. ‘మారేడుమిల్లి ‘ నేపథ్యంలో నడిచే ఈ కథ  ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here