జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

128

హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు అర్హమ్ ఖాన్, మహేందర్‌రెడ్డి, శంకర్ గౌడ్, ఏవీ రత్నం, షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్, రాజలింగం, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here