దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న కీర్తి… వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘గుడ్ లక్ సఖి’ ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది.
ఇదిలావుంచితే, ఆమె ఈ రోజు తన సొంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన ఛానల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది. తన ఛానల్ ను అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడాలని కోరింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్ నెస్ తదితర వీడియోలను కీర్తి పంచుకోనున్నట్టు సమాచారం.