గీతా ఆర్ట్స్ లో బాలయ్య

207

ఎవరూ ఊహించని విధంగా బాలయ్య, అల్లు అరవింద్ ఈ మధ్య క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. నిజానికి వాళ్ళు 40 ఏళ్లుగా మంచి స్నేహితులు. కానీ బయట ప్రపంచానికి తెలియదు. రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి.
తామెంత మంచి స్నేహితులు అనేది ఈ మధ్యే అన్స్టాపబుల్ షో ద్వారా చెప్పేసాడు బాలయ్య.

ఇప్పటికే బాలయ్య కోసం కథ సిద్ధం చేయిస్తున్నాడు అరవింద్. తన కాంపౌండ్ లోకి వచ్చే దర్శకులకి బాలయ్య కోసం కథ సిద్ధం చెయ్యాల్సిందిగా ఇప్పటికే చెప్పేసాడు ఈయన. అవినీతిలో కూరుకుపోయిన సమాజంపై ఓ నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ చేసే యుధ్దం ఈ సినిమా కథ అని తెలుస్తుంది. మొత్తానికి అల్లు అరవింద్, బాలయ్య కాంబినేషన్ పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here