పుష్ప మూవీలో నారా చంద్రబాబు నాయుడు

493

అమెజాన్ ప్రైమ్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గత రెండు రోజుల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని సమాచారం .

సుకుమార్ ఈ సినిమాను 1996 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం మధ్య జరిగే కథగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటూ ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పుష్ప కథ జరిగినట్టు చూపించడంతో పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు అభిమానులు డైరెక్టర్ సుకుమార్ క్రియేటివిటీని తెగ మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు ఆ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో పుష్ప ది రైజ్ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here