తెలంగాణాలో మళ్ళీ లాక్ డౌన్ ?

375

 తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

జనవరి చివరి వారంలో ఆ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం ఉండవచ్చని తెలిపారు. వైరస్ కట్టడికి ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. అలాగే, అర్హులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 84 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. 3వేల 779 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32 మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు.

కాగా, కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం టీకా కేంద్రాల్లో 15ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.

గడిచిన ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నిన్న దేశంలో 33వేల 750 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 123 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, నిన్న 10వేల 846 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం 1,45,582 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉంది. 4,81,893 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,45,68,89,306 కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here