శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది.

కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెప్తూ వచ్చారు. శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివ శంకర్ మాస్టర్ 8 గంటల సమయం లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

ఇప్పటికే శివశంకర్ మాస్టర్ కోలుకోవాలని సినిమాతారలు ప్రార్ధనలు చేశారు. కానీ వారి ప్రార్ధనలు ఫలించలేదు. కొద్దీ సేపటి క్రితం ఆయన తుది శ్వస విడిచారు. సోనూసూద్, హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here