ఒక దేశ పౌరుడు ఉద్వేగానికి లోనయ్యేది కేవలం ఆ దేశం చరిత్ర గురుంచి ఆ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాటం చేసిన గొప్ప గొప్ప మహానుభావుల గురుంచి తెలుసుకున్నప్పుడు ఏ సమయంలోనైనా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేశ పౌరులు ఉద్వేగంతో కన్నీటి పర్యంతం అవుతుంటారు. మరి అది ఒక దృశ్య రూపంలో చూస్తే ఇక ఆ భావద్వేగానికి ఎల్లలు ఉండవు.

ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు విడుదలైన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని జనని పాట. పాట వింటున్నంతసేపు రోమాలు
నిక్కపొడుచుకుంటున్నాయి. ఈ పాటలోని ఇంకొక విశేషం ఏమిటంటే పదరచన, స్వరరచన, గాత్రం కీరవాణి గారే అందించడం. ఎటువంటి భావోద్వేగాన్నైనా తన సంగీతంతో అద్భుతంగా పలికించగల కీరవాణి గారు ఈ పాటను అంతే గొప్పగా తీర్చిదిద్దారు.

ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇద్దరు స్వాత్రంత్ర పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీం ల జీవిత విశేషాలతో రూపొందించిన కధ అని తెలిసిందే. సాహిత్యం,సంగీతం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో దృశ్యాన్ని కూడా తీర్చిదిద్దారు రాజమౌళి గారు. ఈ పాటలో ఆ అమర వీరులు పోరాటం, వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు ముఖ్యంగా ఈ భారత జాతి కోసం వారు చేసిన కృషిని చూపించారు జక్కన్న . ఈ పాటను చూసిన వారేవైనా “మేరా భారత్ మహాన్” అనక మానరు.

ఈ పాటతోనే దర్శక ధీరుడు రాజమౌళి తన మస్తిష్కం లోని ఆలోచనలతో ఈ చిత్రాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అర్ధమవుతోంది. మరి ఈ చిత్రం జనవరి 7 2022 విడుదలయ్యి ఈ జాతి గొప్పతనాన్ని తెలియజేసి విజయవంతమవ్వాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here