పరుచూరి బ్రదర్స్ తరువాత తెలుగు సినిమాలకు సంబంధించి భావోద్వేగాన్ని రెచ్చగొట్ట గలిగిన సంభాషణలు వ్రాయడంలో బుర్రా సాయి మాధవ్ కు చాలమంచి పేరుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో బాలయ్య నోటివెంట వచ్చిన ప్రతి డైలాగ్ వెనుక బుర్రా సాయి మాధవ్ కలం ఉంది.
సాధారణంగా రాజమౌళి సినిమాలకు పేరు గాంచిన డైలాగ్ రైటర్స్ పనిచేయరు.

అయితే ఈసారి ‘ఆర్ ఆర్ ఆర్’ స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో నడిచే కథ కాబట్టి ఈసారి రాజమౌళి టీమ్ లో వ్యూహాత్మకంగా బుర్రా సాయి మాధవ్ వచ్చి చేరారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈసినిమా పై ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రచయిత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఘన విజయాన్ని అంచనా వేయడానికి కొలమానాలు సరిపోవని ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఊహించని కనీవినీ ఎరుగని ఘనవిజయం ‘ఆర్ ఆర్ ఆర్’ సాధించబోతోంది అంటూ జోశ్యం చెప్పారు.

ఇప్పుడు ఈ కామెంట్స్ జూనియర్ చరణ్ అభిమానులలో వైరల్ గా మారాయి. దీనితో ఈమూవీ పై వారు మరింత అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఈ కామెంట్స్ పరిశీలించిన కొందరు విశ్లేషకులు మాత్రం వేరే విధంగా అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన భారీ సినిమాలు ఎలాంటి పోటీ లేకుండా విడుదల అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here